NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భూ సమస్య పరిష్కరించేంత వరకు చొరబడవద్దు..

1 min read

నిబంధనలు ఉల్లంగిస్తే చట్టమైన కఠిన చర్యలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : ఏలూరు జిల్లాదెందులూరు నియోజకవర్గంపెదవేగి మండల రామసింగవరం రెవిన్యూ గ్రామం కూచింపూడి  పరిధిలో  ఎస్ సి నిరుపేద మహిళలకు ఎస్ సి కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన 19 ఎకరాల 58 సెంట్లు భూమిని  ఒక అగ్రవర్ణ రైతు ఆక్రమించాడని.గత కొన్నేళ్లుగా అగ్రవర్ణ రైతుకు , దళిత మహిళలకు మధ్య జరుగుతున్న వివాదం.ఈ సమస్య పరిష్కరించే వరకు ఆ భూమిలోకి అగ్రవర్ణ రైతు గాని,  వారి అనుచరులు గాని  అలాగే దళిత మహిళలు గాని ,వారి బంధువులు గాని వెళ్లకూడదని 145 సెక్షన్ విధించినట్టు   పెదవేగి తహసీల్దార్ నల్లమెల్లి నాగరాజు  తెలియజేశారు. ఎవరైనా145 సెక్షన్ అమల్లో ఉండగా ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని  పెదవేగి తహసీల్దార్ నాగరాజు హెచ్చరించారు.

About Author