PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలియో చుక్కలు వేయించడంలో నిర్లక్ష్యం వహించరాదు

1 min read

లయన్స్ జిల్లా అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీ  లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  0-5  సంవత్సరాలలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలను వేయించి వారిని అంగవైకల్యం బారిన పడకుండా జాగ్రత్తపడవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనిని లయన్స్ జిల్లా అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీ, అసోసియేషన్  ఆఫ్ అలయన్స్  క్లబ్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కౌన్సిల్ చైర్మన్ అల్లాయ్ అండ్ లయన్ డాక్టర్ అంబాసిడర్ రాయపాటి శ్రీనివాస్ అన్నారు. పోలియో దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్  అసోసియేషన్ ఆఫ్ అలియన్స్ ఇంటర్నేషనల్ గ్రేటర్ కర్నూల్  క్లబ్ ల సంయుక్త ఆధ్వర్యంలో చింతల ముని నగర్ లోని పోలియో కేంద్రంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులను ప్రోత్సహించడానికి గాను బిస్కెట్ ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ పోలియో రహిత భారతదేశం ఏర్పాటు కోసం స్వచ్ఛంద సంస్థలు తన వంతు సహకారం  అందించాలన్నారు.కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు మెల్విన్ జోన్స్ అధ్యక్షురాలు లయన్ రాయపాటి నాగలక్ష్మి, కార్యదర్శి లయన్ సి.డి గోవర్ధనగిరి , లయన్స్ క్లబ్సభ్యులు, ఆశా వర్కర్ డి. శారద ,అంగన్వాడీ టీచర్ బి. వెంకటేశ్వరమ్మ, నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు, లక్ష్మీ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author