PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా సమస్యల పరిష్కారాలపై నిర్లక్ష్యం చూపొద్దు

1 min read

– స్పందన వచ్చిన అర్జీలను గడవు లోపు పరిష్కారం అయ్యేటట్టు చర్యలు తీసుకోండి

– స్పందన అర్జీలను నాణ్యతగా పరిష్కరించండి

– ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్

పల్లెవెలుగు వెబ్ ఆదోని: స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జిదారులను సంతృప్తిపరిచేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సూచించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు స్పందనలో పాల్గొని డివిజన్లోని ఆయా మండలాల నుంచి వచ్చిన ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మండలంలోని ఆయా శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తూ వారంలోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ ఎల్ ఏ లోకి వెళ్లకుండా చూడాలన్నారు.

మండలాల నుంచి వచ్చిన సమస్యలు కొన్ని. :-

1. ఆదోని పట్టణం ఎస్ కె డి కాలనీ కి చెందిన వినీత సంబంధించి మండలంలోని పర్వతాపురం గ్రామంలో సర్వేనెంబర్ 200/ఏ2 నందు 5.86 ఎకరాల భూమి కలదు. ప్రస్తుతం ఆ యొక్క భూమిని వేరేవారు ఆక్రమణకు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని అర్జీ సమర్పించుకున్నారు.

2. ఆస్పరి మండలం పుట్టుకలమర్రి గ్రామంలో మోడల్ స్కూల్ నందు వివిధ గ్రామాల నుండి చదువుకోవడానికి పాఠశాలకు వస్తున్నారు. ప్రస్తుతం ఆదోని డిపో నుండి పుటకల మర్రి వరకు విద్యార్థి బస్సు ఏర్పాటు చేయాలని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు అర్జీ సమర్పించుకున్నారు.

3. ఆదోని మండలం నాగలాపురం గ్రామానికి చెందిన ఈరేష్ సంబంధించి ఎమ్మిగనూరు మండలం కోటేకల్ గ్రామం నందు సర్వేనెంబర్ 616/5 నందు విస్తీర్ణం 50 సెంట్ల భూమిని ఆన్లైన్ నందు నమోదు చేయవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు.4. మంత్రాలయం మండలం సింగరాజున హళ్లి గ్రామానికి చెందిన టి. ఈరన్న సంబంధించి సర్వే నంబర్ 27/ఏ 3 నందు 2.10 ఎకరాల భూమి ప్రభుత్వం నుండి సంక్రమించినది ప్రస్తుతం ఆన్లైన్ , అడంగల్ నందు వేరే వారి పేరు ఉన్నది. దయతో విచారణ చేసి మా యెక్క పేరు నమోదు చేయవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు.

5. గోనెగండ్ల మండలం బి అగ్రహారం గ్రామానికి చెందిన ఏ రత్నం సంబంధించి ఎమ్మిగనూరు మండలం కడివెళ్ళ గ్రామంలో  సర్వే నంబర్ 22 నందు 7.55 ఎకరాల భూమి పెద్దలనుండి సంక్రమించినది ప్రస్తుతం ఆన్లైన్ నందు 4.50 ఎకరాల భూమి వేరే వారి పేరు మీద ఉన్నది.దయతో విచారణ చేసి మా యెక్క పేరు నమోదు చేయవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న  డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, డి ఎల్ డి వో నాగేశ్వరరావు, డి ఎల్ పి ఓ నూర్జహాన్, గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఇంజనీర్ రవికుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చేతన్ ప్రియా, బీసీ వెల్ఫేర్ లక్ష్మీనారాయణ, ఉప తాసిల్దారులు కౌసర్ భాను, వలిబాష ,తదితర అధికారులు పాల్గొన్నారు.

About Author