చార్జీలు పెంచక తప్పదు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఈ సంవత్సరం టెలికం ఛార్జీలు మరింత పెంచక తప్పదని ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. ఛార్జీల పెంపు ద్వారానే ఈ సంవత్సరం ఒక్కో ఖాతాదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం రూ.200కి చేర్చాలన్న లక్ష్యం సాధ్యమవుతుందని కంపెనీ ఎండీ, సీఈఓ గోపాల్ విఠల్ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రూ.300 ఆర్పూ సాధించాలన్నది తమ లక్ష్యమన్నారు. ఇన్వెస్టర్ల కాల్‌కు సమాధానంగా విఠల్ ఈ విషయం చెప్పారు. చిప్స్ కొరతతో స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరిగినా 20 కోట్ల మంది పోస్ట్‌పెయిడ్ ఖాతాదారులను సంపాదించినట్టు తెలిపారు.