కేసీ కెనాల్ కింద వరి నాట వద్దు
1 min read– మండల వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి..
పల్లెవెలుగు వెబ్ గడివేముల : గడివేముల మండలంలోని ఐదువేల ఎకరాల సాధారణ వరి విస్తీర్ణానికి గాను ఇప్పటివరకు వరి సాగు 2300 ఎకరాలలో సాగు అయినది. 15- 9-23 వ తేదీన నీటి సలహా బోర్డు సమావేశంలో గౌరవ సభ్యులు తీసుకున్నటువంటి నిర్ణయాలను శనివారం రైతులకు తెలియజేశారు.ఈ సంవత్సరము వర్షాలు అనుకూలంగా లేనందువల్ల శ్రీశైలం డ్యాము నిండనందు వలన కేసీ కెనాల్ కు నీరు విడుదలకు సంబంధించి కేవలం ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాల్సిందిగా సూచించారు రైతు సోదరులు నీటి ఆవశ్యకత ఎక్కువ ఉన్నటువంటి వరి పంటను వేయకుండా బదులుగా రెండవ పంట లో జొన్న , మొక్కజొన్న మినుములు, కొర్రలు, సోయాబీన్స్ లాంటి స్వల్పకాలిక పంటలు మాత్రమే వేసుకోవాలని వ్యవసాయ శాఖ పత్రిక ప్రకటనలో తెలిపారు.