పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడొద్దు !
1 min readపల్లెవెలుగువెబ్ : భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ విషయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో ఆడేందుకు టీమ్‌ను పంపకూడదని భారత్ నిర్ణయించుకున్నప్పుడు ఆస్ట్రేలియాలో పాక్ తో క్రికెట్ మ్యాచ్ ఆడకూడదని అన్నారు. టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం భారత్, పాక్ మధ్య మ్యాచ్ కు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ పార్టీ కార్యక్రమంలో ప్రసంగించిన ఒవైసీ ‘రేపు పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఎందుకు ఆడుతున్నారు? మేము పాకిస్థాన్‌కు వెళ్లము అన్నప్పుడు ఆ జట్టుతో ఆడకూడదు కదా! పాక్ వెళ్లము కానీ, ఆస్ట్రేలియాలో ఆ జట్టుతో ఆడుకుంటాం అంటారా? పాక్ తో ఆడకుంటే ఏమవుతుంది? రూ.2,000 కోట్ల నష్టం వస్తుందా? కానీ, అది మన దేశం కంటే ముఖ్యమా? వదిలివేయండి, ఆడకండి’ అని అసద్ పేర్కొన్నారు.