ఇళ్ల నిర్మాణాల్లో కారణాలు వద్దు చేసి చూపించండి
1 min read– డ్యూటీ సమయంలో కాదు వెళ్లాల్సింది -లబ్ధిదారుల దగ్గరికి ఉదయం సాయంత్రం వెళ్ళండి –
– ఎవ్వరికీ సెలవులు లేవ్ విధుల పట్ల శ్రద్ధ కనబరచండి
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: జగనన్న కాలనీలలో ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని చెబుతున్నా ఏదేదో కారణాలు చెబుతున్నారని అలా కాకుండా లోనిర్మాణాల్లో పురోగతి చేసి చూపించాలని ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గృహాలపై తహసిల్దార్ మరియు పంచాయతీ కార్యదర్శులు,వీఆర్వోలు,వెలుగు సీసీలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు,వెల్ఫేర్ అసిస్టెంట్లు తదితర శాఖల అధికారులతో పున సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఇంతవరకు గ్రామాల్లో ఏఏ దశలలో ఇళ్ల నిర్మాణాలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.మండలంలో 258 ఇల్లు వివిధ దశలలో ఉన్నాయని వీటన్నిటిని కూడా ఉగాది లోపు పూర్తి పూర్తిచేసే విధంగా లబ్ధిదారులకు వివరంగా తెలుపాలని వీటి పట్ల జిల్లా కలెక్టర్ చాలా సీరియస్ గా ఉన్నారని 7వ తేది నుంచి 20వ తేది వరకు యాక్షన్ ప్లాన్ చేశారు.ఈరెండు వారాల్లో పురోగతి కాస్త మెరుగుపడాలన్నారు .మండలంలో మిడుతూరు, చౌటుకూరు,తిమ్మాపురం గ్రామాలు వెనుకబడ్డాయని గత రెండు వారాలతో పోలిస్తే జలకనూరు,అలగనూరు,నాగలూటి గ్రామాలు కాస్త మెరుగ్గా ఉన్నాయన్నారు.గ్రామాల్లో మీడ్యూటీ సమయంలో 10:30 నుంచి 5 గంటల లోపల అయితే ప్రజలు పొలం పనుల్లో నిమగ్నం అయి ఉంటారు.మీడ్యూటీ సమయంలోనే వెళ్తామంటే కుదరదు.ఉదయం మరియు సాయంత్రం 7 వరకు కానీ ఫీల్డ్ లో ఉండి లబ్ధిదారులకు వివరంగా తెలియజేస్తూ వివిధ దశలలో ఉన్న ఇళ్ల నిర్మాణాల్లో తప్పనిసరిగా పురోగతి చూపాల్సిందేనన్నారు.అవసరమైతే పొదుపు సంఘాల నుండి రుణాలు ఇప్పించే విధంగా చూడాలని అంతే కాకుండా వీటిలో ప్రతి అధికారి తప్పనిసరిగా పాల్గొనాలని గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు ఎవరికీ కూడా సెలవులు లేవన్నారు.మీరు ప్రతి ఒక్కరూ విధుల పట్ల శ్రద్ధ కనబరిస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని ఎంపీడీవో మరియు తహసిల్దార్ సిరాజుద్దీన్,ఈఓఆర్డి ఫక్రుద్దీన్ అన్నారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఇంచార్జ్ ఏఈ జె.రమేష్, డిప్యూటీ తహసిల్దార్ రవణమ్మ,ఏపీఎం సుబ్బయ్య,ఏపీవో జయంతి తదితరులు పాల్గొన్నారు.