కలిసి నిద్రించవద్దు.. ముద్దులు వద్దు !
1 min read
Morning of Lujiazui's buildings
పల్లెవెలుగువెబ్ : చైనాలోని షాంఘై నగరంలో ఆసక్తికర నిబంధనలు విధించారు. కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆర్థిక కేంద్రమైన షాంఘై నగరంలో ప్రజలకు సంచలన హెచ్చరిక జారీ చేశారు.‘‘కలిసి నిద్రించవద్దు, కౌగిలింతలు,ముద్దులు పెట్టుకోవద్దు…’’ అంటూ లాక్‌డౌన్ విధించిన షాంఘై నగరవాసులను హెచ్చరించారు. దీంతో సందడిగా ఉండే షాంఘై నగర వీధులు లాక్ డౌన్ ఆంక్షలతో ఖాళీగా కనిపిస్తున్నాయి. షాంఘై వీధుల్లో కేవలం ఆరోగ్య కార్యకర్తలు మాత్రమే కనిపిస్తున్నారు.కరోనా కట్టడి కోసం షాంఘై వాసులు కఠినమైన జీవితాన్ని గడుపుతున్నారు.చైనా దేశంలోని షాంఘై నగరం కరోనా వ్యాప్తికి హాట్ స్పాట్ గా మారింది.