NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పుకార్లు వ్యాప్తి చేయొద్దు : మీనా

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ న‌టి మీనా భర్త విద్యాసాగర్ జూన్ 29న ఊపిరితిత్తుల సమస్యతో మరణించారు. ఆయన మరణంపై అనేక పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మీనా సోషల్ మీడియాలో ఓ ప్రకటనను విడుదల చేశారు. భర్త మరణంతో తీవ్ర విచారంలో ఉన్నామని మీనా పేర్కొన్నారు. ‘‘పరిస్థితిని అర్థం చేసుకుని మీడియా సంయమనం పాటించాలి. మాకు గోప్యతనివ్వాలి. నా భర్త మృతి విషయంలో ఎటుంటి అసత్యాలు ప్రచారం చేయవద్దు. ఇటువంటి ఇబ్బందికర సమయంలో సహృదయంతో మా కుటుంబానికీ అండగా నిలిచిన వారికీ కృతజ్ఞతలు. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, ఐఏఏస్ ఆఫీసర్ రాధాకృష్ణన్, మిత్రులు, సన్నిహితులు అందరికీ ధన్యవాదాలు’’ అని మీనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.

                                     

About Author