కామెర్లను తేలిగ్గా తీసుకోవద్దు !
1 min readపల్లెవెలుగువెబ్: పరిశోధకులు కామెర్ల వ్యాధి గురించి కీలక అంశాలను వెల్లడించారు. ప్రమాదకరమైన పేంక్రియాటిక్ క్యాన్సర్ కు కామెర్ల వ్యాధి కూడా ఓ సంకేతం అని పేర్కొన్నారు. పేంక్రియాటిక్ క్యాన్సర్ బారినపడిన వారిలో తొలిదశలో కామెర్లు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు. సాధారణంగా పేంక్రియాటిక్ క్యాన్సర్ ఎంతో అరుదైనది, అదే సమయంలో ప్రాణాంతకమైనది. పేంక్రియాటిక్ క్యాన్సర్ ను గుర్తించడంలో మూత్రం రంగు కూడా కీలకపాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రక్తం ముదురు గోధుమ రంగులో కనిపిస్తే అనుమానించాల్సిందేనట. రక్తంలో అధికస్థాయిలో ఉండే బైలురుబిన్ మూత్రంలోనూ చేరుతుందని, తద్వారా అది కామెర్ల వ్యాధి లక్షణంగా భావించాల్సి ఉంటుందని నిపుణులు వివరించారు. పేంక్రియాటిక్ క్యాన్సర్ ప్రారంభ దశ ఇలాగే ఉంటుందని పేర్కొన్నారు. అందుకే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవడం మేలన్నది నిపుణుల అభిప్రాయం.