PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కరెంటు బిల్లులు చెల్లించడానికి చిల్లర డబ్బులు తీసుకోము..

1 min read

– విద్యుత్ బిల్ కలెక్టర్ వింత వైఖరి..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల పరిధిలోని బిలకల గూడూరు గ్రామంలో ఓ వ్యక్తి కరెంటు బిల్లు చెల్లించడానికి అతని వద్ద ఉన్న 50 రూపాయలు నోట్ తో పాటు కొంత ఐదు రూపాయల నాణ్యాలు తీసుకెళ్లాడు. బిల్ కలెక్టర్ చిల్లర డబ్బులు తీసుకురావద్దని చెప్పడంతో విద్యుత్ వినియోగదారుడు నివ్వెరపోయాడు. తాను ఇల్లు హోటల్ బిల్ కలిపి రెండు వేల రూపాయలు నోట్లు కట్టానని అనంతరం మోటర్ బిల్లు 237 కు గాను ఐదు రూపాయల బిల్లలు 200 పైచిలుకు రూపాయలు ఇవ్వడానికి వెళితే తనతో దురుసుగా ప్రవర్తించి బిల్లు కట్టించుకోకుండా వెళ్లిపోయాడని మంగళవారం నాడు బిల్కల్ గూడూరు గ్రామానికి చెందిన బాధితుడు అబ్దుల్ రకీబ్ వాపోయాడు బ్యాంకులో ఐదు రూపాయల నాణ్యాలు చెల్లవని తీసుకోనని ఇబ్బందులకు గురిచేసిన బిల్ కలెక్టర్ సుబ్బారావు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

About Author