ఆఫీస్ లో సెల్ ఫోన్ వాడొద్దు !
1 min readపల్లెవెలుగువెబ్ : తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు మద్రాస్ హైకోర్టు గట్టి షాకిచ్చింది. ప్రభత్వ సిబ్బంది ఆఫీసు పనివేళల్లో సెల్‌ఫోన్ మాట్లాడరాదని, మొబైల్ కెమెరాను కూడా వినియోగించకూడదని స్పష్టం చేసింది. పని వేళల్లో ఫోన్ వినియోగాన్ని నియంత్రించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉద్యోగులు కార్యాలయంలోకి రాగానే తమ సెల్‌ఫోన్లు భద్రపరచుకునేందుకు అనువుగా ప్రత్యేక లాకర్లు ఏర్పాటు చేయాలని కూడా స్పష్టం చేసింది. కార్యాలయ అవసరాలకు, అత్యవసర పరిస్థితులకు మాత్రం ఉద్యోగులు అధికారిక నంబరు ద్వారా ఫోన్ చేసుకోవచ్చని సూచించింది. అంతే తప్ప కార్యాలయాల్లో ఇష్టానుసారంగా మొబైల్ ఫోన్ వాడకాన్ని తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఎం సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీచేశారు.