ఆ దేశంలో మాస్కులు వేసుకోరు..?
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన కరాళనృత్యం చేస్తున్న వేళ.. వందలాది మంది మృత్యువాతపడుతున్న సందర్భంలో.. ఇజ్రాయిల్ మాస్క్ వేసుకోనవసరంలేదని తేల్చేసింది. తమ దేశ పౌరులు ఇక నుంచి మాస్కు తప్పనిసరిగా వేసుకోవాలన్న నిబంధనలలేదని ఆదేశ అధ్యక్షుడు బెంజిమన్ నెతన్యెహూ ప్రకటించారు. మరి, ఇక్కడ కరోన లేదా? అంటే. ఖచ్చితంగా ఉంది. కానీ, ఇప్పటికే ఆ దేశ పౌరులు సగం మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. మొదటి డోసు 60 శాతం మంది, రెండో డోసు 56 శాతం మంది తీసుకున్నారు. దీంతో ఇజ్రాయిల్ లోని గుడులు, బడులు, ప్రార్థనా మందిరాలు, మాల్స్ ఇలా అన్ని బహిరంగ ప్రదేశాల్లోను మాస్కు తప్పనిసరి అన్న నిబంధన ఆ దేశ ప్రభుత్వం రద్దు చేసింది. కరోన మీద పోరాటంలో ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలిచామని ఆ దేశ అధ్యక్షుడు బెంజిమన్ నెతన్యాహూ తెలిపారు.