బొగ్గు నిల్వలపై ఆందోళన వద్దు.. సరఫరా పెంచుతాం
1 min readపల్లెవెలుగు వెబ్ : దేశంలోని పలు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత ఏర్పడిందన్న వార్తలు వస్తున్నాయి. దీంతో విద్యుత్ సంక్షోభం రానుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీని పై బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. బొగ్గు నిల్వలపై ఆందోళన చెందవద్దని చెప్పారు. డిమాండ్ కు సరిపడా బొగ్గు సరఫరా పెంచుతున్నామని తెలిపారు. సోమవారం రికార్డు స్థాయిలో బొగ్గు సరఫరా చేసినట్టు ప్రకటించారు. వర్షాకాలం తర్వాత మరింత సరఫరా పెంచుతామని, ప్రజలెవరూ ఆందోళ చెందవద్దని చెప్పారు. డిమాండ్ కు సరిపడా బొగ్గును అందుబాటులో ఉంచుతామని హామీ ఇస్తున్నట్టు ఆయన తెలిపారు.