బట్టతల పై జుట్టు పెరగాలంటే ఇలా చేయండి !
1 min readపల్లెవెలుగు వెబ్ : బట్టతల చాలా మందికి వస్తుంది. వంశపారంపర్యంగా, వివిధ సమస్యల వల్ల బట్టతల వస్తుంది. వెంట్రుకలు రాలడానికి కూడ చాలా సమస్యలు ఉన్నాయి. బట్టతల కవర్ చేసుకోవడానికి చాలా మంది హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుంటారు. కొంత మంది నానా పాట్లు పడుతుంటారు. కొన్ని చిట్కాలు వైద్యుల సలహా, సూచన మేరకు వాడితే మంచి ఫలితం ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
- రోజూ కొబ్బరి నూనెతో మసాజ్ చేయాలి. దీని వల్ల ఫాలికిల్స్ యాక్టివ్ గా మారి జుట్టు పెరగడానికి దోహదపడుతుంది.
- అలోవేరా జెల్ తలకు పట్టించాక గంట తర్వాత స్నానం చేయాలి.
- ఫిష్ ఆయిల్ లో ఓమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు తోడ్పడుతాయి.
- ఉల్లిపాయ జ్యూస్ బట్టతల పై జుట్టు పెరిగేలా చేస్తుంది. కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి వాడటం వల్ల కూడ మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
- వైద్యుల సలహా, సూచన మేరకు ఇలాంటి చిట్కాలు వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్స్ట్ ఉండే అవకాశం ఉండదు.