షుగర్ వల్ల ఇబ్బందులు రాకుండా ఇలా చేయండి !
1 min readపల్లెవెలుగువెబ్ : చిన్నప్పటి నుంచి మన ఆహారంలో ఒక భాగమయిపోయిన చక్కెర తినటం పూర్తిగా మానివేయటం చాలా కష్టం. ఒక వేళ కష్టపడి మానేసినా- చక్కెర తినాలనే కోరిక రోజురోజుకు పెరిగిపోతూ ఉంటుంది. చివరకు రకరకాల ఆరోగ్య సమస్యలు తెచ్చి పెడుతుంది. ఇలాంటి ఇబ్బందులు లేకుండా చక్కెరకు ప్రత్యామ్నాయాలను పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. చాలా మందికి ఉదయాన్నే తినే కార్న్‌ఫ్లేక్స్‌లో ఒక చెంచాడు పంచదార వేసుకోవటం ఒక అలవాటు. దీని వల్ల శరీరంలో చక్కెర విలువలు బాగా పెరుగుతాయి. చెక్కరకు బదులుగా పళ్ల ముక్కలకు కలిపితే కార్న్‌ఫ్లేక్స్ రుచికరంగా ఉంటాయి. బయటకు వెళ్లినప్పుడు కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కోలాలు తాగాల్సి వస్తుంది. అలాంటి తప్పనిసరి పరిస్థితుల్లో సుగర్‌ఫ్రీ కోలాలు అందుబాటులో ఉన్నాయోమో చూసుకొని తాగండి. చాలా మందికి రాత్రి భోజనం తర్వాత స్వీట్ తినే అలవాటు ఉంటుంది. స్వీటుకు బదులుగా పళ్లను తినటం అలవాటు చేసుకోండి. రెడీ టూ ఈట్ ఫుడ్‌లు, కెచప్‌లలో సుగర్ శాతం చాలా ఎక్కువ ఉంటుంది. వీలైనంత వరకూ వాటిని తినకుండా ఉంటే మంచిది. ఒక వేళ తప్పనిసరి పరిస్థితులు ఏర్పడితే- సాల్సా, మస్టర్డ్ సాస్ వంటివి తినటం మంచిది.