PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నోటి దుర్వాస‌న రాకుండా ఇలా చేయండి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌స్తుత త‌రుణంలో నోటి దుర్వాస‌న చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. న‌లుగురిలో క‌లిసి మాట్లాడాలంటే ఆత్మ‌నూన్య‌తగా భావిస్తారు. ఇలాంటి ఇబ్బందికి చెక్ పెట్టాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. పెరుగులో ప్రోబయోటిక్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి నోటి దుర్వాసన సమస్యను పోగొడతాయి. భోజనం చివర్లో కచ్చితంగా పెరుగన్నంతో తినడం అలవాటు చేసుకుంటే నోట్లో ఉండే చెడు బాక్టీరియా నశిస్తుంది. ఫలితంగా నోరు దుర్వాసన రాదు. భోజనం చేశాక 30 నిమిషాల తరువాత గ్రీన్‌ టీ తాగండి. ఇందులో ఉండే పవర్‌ఫుల్‌ యాంటీ ఆక్సిడెంట్లు క్రిములను నాశనం చేస్తాయి. దీంతో నోట్లో ఉండే బాక్టీరియా నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది. ఆహారంలో క్యాప్సికమ్, బ్రొకోలిలను భాగం చేసుకోవాలి. వీటిలో ఉండే విటమిన్‌ సి క్రిములను చంపేస్తుంది. దీంతో నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది. విటమిన్‌ సి ఎక్కువగా ఉండే పండ్లను తినాలి. నారింజ, కివీ, స్ట్రాబెర్రీ, పైనాపిల్‌ వంటి పండ్లను తింటుంటే నోటి దుర్వాసన రాదు. దంత సమస్యలు కూడా పోతాయి. చిగుళ్లు, దంతాలు దృఢంగా మారుతాయి. భోజనం చేశాక ఒకటి రెండు లవంగాలను నోట్లో వేసుకుని చాలా సేపు అలాగే చప్పరించాలి. దీంతో నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు. లవంగాల్లో ఉండే పవర్‌ఫుల్‌ యాంటీ ఆక్సిడెంట్లు క్రిములను నాశనం చేసి నోటి దుర్వాసనను తగ్గిస్తాయి.

                                

About Author