జుట్టు రాలకుండా ఇలా చేయండి !
1 min readపల్లెవెలుగు వెబ్ : చాలా మందిలో వెంట్రుకలు రాలే సమస్య ఉంటోంది. ఈ సమస్యను మందులతో కాకుండా, సహజసిద్ధంగా పరిష్కరించుకునే అవకాశం ఉంది. మెంతులు, కరివేపాకు, కొబ్బరినూనెతో వెంట్రుకలకు బలాన్నిచ్చి, ఊడిపోకుండా కాపాడుకోవచ్చు. నాలుగు టీస్పూన్ల మెంతులు, ఓ గుప్పెడు కరివేపాకు, ఓ కప్పు తాజా కొబ్బరి నూనె తీసుకుని, చిన్న మంట పై పది నిమిషాల పాటు మరిగించాలి. మరిగించిన నూనెను రెండు రోజుల పాటు వాడకుండా సీసాలో నింపి ఉంచాలి. తర్వాత వారానికి రెండు సార్లు ఈ నూనెను కుదుళ్లకు పట్టించి సున్నితంగా మునివేళ్లతో మర్దన చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే, జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది. వెంట్రుకలు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతాయి.