పిజ్జా, చిప్స్ తింటున్నారా ?.. అయితే జాగ్రత్త పడండి !
1 min readపల్లెవెలుగు వెబ్ : పిజ్జా, చిప్స్ లాంటి ఫాస్ట్ ఫుడ్ తినేముందు ఓసారి ఆలోచించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ తింటే బరువు పెరగడం, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు వస్తాయని తెలుసు. వీటిని తినడం వల్ల జ్ఞాపకశక్తి కూడ తగ్గుతుందన్న విషయం తాజా పరిశోధనలో వెల్లడైంది. బ్రెయిన్, బిహేవియర్, ఇమ్యునిటీ జర్నల్ ప్రచురించిన అధ్యయనంలో హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ తింటే మెమొరీ లాస్ అయ్యే పరిస్థితి వస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వీటిని నిరూపించేందుకు ఎలుకలపై ప్రయోగం చేశారు. ఎలుకలకు హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ అందించగా… వాటి మెదడు పై ప్రభావం చూపాయని పరిశోధకులు తెలిపారు. జ్ఞాపకశక్తి తగ్గడంతో పాటు అల్జీమర్స్ వ్యాధి కూడ వస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని పరిమితంగా తీసుకుని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ డీహెచ్ఏ అధికంగా తీసుకుంటే సమస్యను నిరోధించవచ్చని పరిశోధకులు తెలిపారు.