రాత్రుళ్లు సెల్ ఫోన్ తో గడుపుతున్న నగరం ఏదో తెలుసా ?
1 min readపల్లెవెలుగువెబ్ : హైదరాబాద్ లో నిద్రలో కంటే సోషల్ మీడియాలో ఎక్కువ మంది గడుపుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాలలో 30వేల మంది నెటిజన్లపై అధ్యయనం చేసి రూపొందించిన ‘గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్ కార్డ్ -2022’ వార్షిక నివేదికలో ఈ వివరాలను ప్రస్తావించింది. లేట్‌నైట్ బ్రౌజింగ్‌లో అగ్రస్థానంలో ఉన్నా.. హైదరాబాదీ నెటిజన్లలో 15 శాతం మంది ఉదయాన్నే నిద్ర లేస్తున్నారట! వారిలో 49 శాతం మంది ఆఫీసులో నిద్ర ముంచుకొస్తోందని బదులిచ్చారు. వీరిలో 53 శాతం మంది ఐటీ ఉద్యోగులే. ఆఫీసు వేళల్లో నిద్రమత్తుతో గడుపుతున్న వారి సంఖ్య గతఏడాది 20 శాతం ఉండగా, ప్రస్తుతమది 49 శాతానికి చేరిందని ‘వేక్‌ఫిట్’ పేర్కొంది.