PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గాడ్ ఫాద‌ర్ తొలి రోజు క‌లెక్ష‌న్లు ఎంతో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: చిరంజీవి కథానాయకుడిగా రూపొందిన ‘గాడ్ ఫాదర్’ నిన్ననే థియేటర్లకు వచ్చింది. మలయాళంలో కొంతకాలం క్రితం రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టిన ‘లూసిఫర్’ సినిమాకి ఇది రీమేక్. చిరంజీవి సినిమా అంటేనే పాటలకు .. డాన్సులకు ప్రాధాన్యత ఉంటుంది. అభిమానుల్లో వాటిపై అంచనాలు ఉంటాయి. అయితే తనకి గల ఆ ఇమేజ్ ను పక్కన పెట్టేసి మెగాస్టార్ చేసిన రీమేక్ నే ‘గాడ్ ఫాదర్’. ఎన్వీ ప్రసాద్ – ఆర్ బి చౌదరి నిర్మించిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లనే రాబట్టింది. తొలి రోజునే ఈ సినిమా 38 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. చిరంజీవి పాత్రలోని నిబ్బరం .. నయనతార పాత్రలోని నిండుదనం .. సత్యదేవ్ పాత్రలోని స్వార్థం .. సముద్రఖని పాత్రలోని స్త్రీ వ్యామోహం .. ఇలా ప్రతి పాత్రను మోహన్ రాజా తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.

                            

About Author