వాయి కాలుష్యంతో ఎంత మంది చనిపోయారో తెలుసా ?
1 min readపల్లెవెలుగువెబ్ : వాయు కాలుష్యం వల్ల లక్షకు పైగా మరణాలు సంభవించాయి. 2005-2018 మధ్య హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కోల్‌కత, చెన్నై, సూరత్, పుణె, అహ్మదాబాద్ లాంటి 8 ప్రధాన నగరాల్లో ఈ మరణాలు సంభవించినట్టు తాజా అధ్యయనంలో తేలింది. లక్షకు పైగా ముందస్తు మరణాలు సంభవించినట్టు తెలుస్తోంది. అమెరికా, యూరప్ అంతరిక్ష పరిశోధన సంస్థలైన నాసా, ఈఎస్ఏ ఉపగ్రహాల ద్వారా రోదసి నుంచి సేకరించిన డేటా ఆధారంగా అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. అధ్యయనంలోని వివరాల మేరకు.. ఆయా నగరాల్లో వాయునాణ్యత వేగంగా క్షీణిస్తోంది. ఆరోగ్యానికి హానికరమైన కాలుష్యకారకాలకు ప్రజలు ఎక్కువగా గురవుతున్నారు. ట్రాఫిక్ పొగ, వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాల దహనం, బొగ్గు, వంట చెరకు విస్తృత వాడకం, పరిశ్రమల వల్లే ఈ కాలుష్యం బాగా పెరుగుతోంది.