PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆధార్ లో `డేట్ ఆఫ్ బ‌ర్త్` ఎన్నిసార్లు మార్చుకోవ‌చ్చో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆధార్ కార్డులో తప్పులు పడితే వాటిని సవరించుకునేందుకు అవకాశం ఉంటుంది. పేరు, పుట్టిన తేదీ, చిరునామా తదితర వివరాలను సవరించుకోవచ్చు. కాకపోతే కొన్నింటి విషయంలో పరిమితులు ఉన్నాయి. ఆధార్ లో ఏది సవరించుకోవాలన్నా, దానికి అనుబంధంగా నమోదైన మొబైల్ నంబర్ యాక్టివ్ లో ఉండాలని గుర్తు పెట్టుకోండి. మొబైల్ నంబర్ మారిపోతే దాన్ని ఆధార్ డేటాబేస్ లో అప్ డేట్ చేసుకోవాలి. దీని కోసం సమీపంలోని ఆధార్ సేవా కేంద్రం లేదా మీసేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీని ఆన్ లైన్ లో అప్ డేట్ చేసుకోవడం వీలు పడదు. నిబంధనల ప్రకారం వేలి ముద్రలు, కంటిపాపల అప్ డేషన్ ను తప్పనిసరిగా చేసుకోవాలి. దీన్ని ఉచితంగా చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ అన్నది కీలకమైనది. ఒకే ఒక్కసారి పుట్టినతేదీలో మార్పులకు అనుమతిస్తారు. ఇక రెండో విడత మార్పు కోరితే అది అసాధారణ కేసుగా పరిగణిస్తారు. రెండో విడత పుట్టిన తేదీలో మార్పు కోరుకునే వారు ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత రీజినల్ ఆఫీస్ కు వెళ్లి అనుమతి కోరాల్సి ఉంటుంది. అధికారులు కార్డుదారు చెప్పే వివరాలు, ఆధారాలతో సంతృప్తి చెందితే సవరణ అభ్యర్థనను ఆమోదిస్తారు.

                                               

About Author