ఏటా ఎంత ఆహారం వృథా అవుతుందో తెలుసా ?
1 min readపల్లెవెలుగువెబ్ : ఆహారం వృథా పై విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఏటా ప్రపంచానికి సరిపడా ఆహారం ఉత్పత్తి అవుతున్నా.. కోట్లాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. లెక్కలేని ఆకలి చావులు కంటపడుతున్నాయి. భూమ్మీద ఏటా ఉత్పత్తి అవుతున్న పండ్లు, కూరగాయల్లో దాదాపు సగం మేర ఏదో ఓ రూపంలో వృథా అవుతూనే ఉన్నాయి. మనుషులు తినేందుకు వీలుగా తయారు చేసిన/వండిన ఆహారంలో దాదాపు మూడో వంతు వరకు.. కిందపడిపోవడం/చెడిపోవడం/పడేయడం ద్వారా ఏటా సుమారు 1,300 టన్నులు వృథా అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా వృథా అవుతున్న ఆహారంలో కనీసం పావు వంతును వినియోగించుకోగలిగినా.. సుమారు 87 కోట్ల మంది ఆకలి తీర్చవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆహారం వృథాలో చైనా తర్వాత ఇండియా రెండో స్థానంలో ఉంది.