ఆర్బీఐ వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా ?
1 min readపల్లెవెలుగువెబ్ : ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆరు నెలల్లో ఆర్‌బీఐ బంగారం నిల్వలను 16.58 టన్నుల మేర పెంచుకుంది. దాంతో 2022 మార్చి చివరి నాటికి మన సెంట్రల్ బ్యాంక్ వద్దనున్న పసిడి ఖజానా 760.42 టన్నులకు పెరిగింది. ఈ మధ్యకాలంలో విదేశీ మారకం నిల్వలు భారీగా తగ్గుకుంటూ వచ్చిన తరుణంలో ఆర్‌బీఐ గోల్డ్ రిజర్వ్‌లను పెంచుకుంటూ రావడం గమనార్హం. 2021 సెప్టెంబరులో ఆల్‌టైం గరిష్ఠ స్థాయి 64,245 కోట్ల డాలర్లకు చేరుకున్న ఆర్‌బీఐ ఫారెక్స్ నిల్వలు.. క్రమంగా తగ్గుతూ వచ్చి ఈ నెల 6తో ముగిసిన వారానికి 59,595 కోట్ల డాలర్లకు పడిపోయాయి.