టమోటాతో ఎన్ని లాభాలో తెలుసా ?
1 min readపల్లెవెలుగువెబ్ : కూరల్లో విరివిగా వాడే టమోటా ఓ పోషకాల గని. వండినదే కాక.. పచ్చిగా సలాడ్ల రూపంలో తినడానికి కూడా అనువైనది. టమోటాల్లో అధిక భాగం నీరు ఉంటుంది. పిండి పదార్థాలు తక్కువగా ఉండడం వల్ల కెలోరీలు కూడా తక్కువే. పీచు పదార్థం, విటమిన్ – సి, పొటాషియం, విటమిన్- కె, ఫోలేట్, బీటా కెరోటీన్ మొదలైనవి టమోటాలో అధికంగా ఉన్నాయి. అందు వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచేందుకు, రోగనిరోధక వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉండేందుకు టమోటా ఉపయోగపడుతుంది. టమోటాలో ఉండే లైకోపీన్, క్లోరినేర్గిక్ యాసిడ్ లాంటి యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి, క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు, చర్మం తాజాగా ఉండడానికి సహాయపడతాయి. వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండేందుకు కూడా ఆహారంలో టమోటా భాగం చేసుకుంటే మంచిది.