స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సంఖ్య ఎంత పెరిగిందో తెలుసా ?
1 min readపల్లెవెలుగువెబ్ : దేశంలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య భారీగా పెరిగింది. డిపాజిటరీల డేటా ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో డీమ్యాట్ అకౌంట్లు ఏకంగా 63 శాతం పెరిగి దాదాపు 9 కోట్లకు చేరుకున్నాయి. ఈ సంక్షోభ కాలంలో మిగతా ఆర్థిక సాధనాలతో పోలిస్తే ఈక్విటీ మార్కెట్లు ఆకర్షణీయ ప్రతిఫలాలు అందిస్తుండటం, స్మార్ట్ఫోన్ ద్వారా ట్రేడింగ్ పెరగడం ఇందుకు ప్రధానంగా దోహదపడింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎ్సఎల్) నిర్వహణలోని యాక్టివ్ డీమ్యాట్ ఖాతాల సంఖ్య 6.3 కోట్లకు చేరుకుంది.