పెగాసస్ మీ ఫోన్ ఎలా హ్యాక్ చేస్తుందో తెలుసా ?
1 min readపల్లెవెలుగు వెబ్ : పెగాసస్.. ఇదొక నిఘా సాఫ్టవేర్. హ్యాకింగ్ దీని ప్రత్యేకత. మన అనుమతి లేకుండానే మన ఫోన్లో చొరబడుతుంది. ఒక్క మిస్డ్ కాల్ వచ్చిందంటే చాలు.. మన ఫోన్లోకి ప్రవేశిస్తుంది. దీనిని గుర్తించడం చాలా కష్టం. మన ఫోన్లోకి చేరి మన డేటా మొత్తం తస్కరిస్తుంది. మనం ఏం చేస్తున్నాం. ఎక్కడ తిరుగుతున్నాం. ఏం తింటున్నాం. ఇలాంటి ఎన్నో విషయాలు మనకు తెలియకుండానే పెగాసస్ సాఫ్ట్ వేర్ నియంత్రించే వారికి తెలిసిపోతుంటాయి. ఈ సాఫ్ట్వేర్ ఇజ్రాయిల్ కి చెందిన ఓ సంస్థ తయారు చేసింది. ఒక్కసారి పెగాసస్ మన ఫోన్లోకి చేరితే ఏం చేసినా.. పోదు. పాస్ వర్డ్ మార్చడం . లేదా ఫోన్ మార్చుకోవడం తప్ప మరే దారి లేదు. మన ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇది నేరం. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తుల సమాచారాన్ని ప్రభుత్వం సేకరించవచ్చు. కానీ ప్రైవేటు సంస్థలు నిఘా వేయడం చట్టరీత్యా నేరం.