ప్రపంచ అప్పు ఎంతో తెలుసా ?
1 min read
పల్లెవెలుగువెబ్ : ప‌్రపంచ అప్పు గురించి ఐఎంఎఫ్ కీలక వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది నాటికి 226 లక్షల కోట్లకు చేరిందని ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ తెలిపింది. 2020లో నమోదైన ప్రపంచ జీడీపీతో పోలిస్తే అప్పు 256 శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యధిక వార్షిక పెరుగుదల అని ఐఎంఎఫ్ పేర్కొంది. పెరిగిన మొత్తం అప్పులు 90 శాతం సంపన్న దేశాలదే వాటా. ఆ దేశాల్లో ప్రభుత్వ అప్పులతో పాటు ప్రైవేట్ అప్పులు కూడ భారీగా పెరిగాయి.