PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ‌జ్జిగ వ‌ల్ల లాభాలేంటో తెలుసా ?

1 min read

పల్లెవెలుగువెబ్ : భోజ‌నం త‌ర్వాత‌, భోజ‌నంలోకిగానీ ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవాల‌ని త‌ర‌చూ ఇంట్లో పెద్ద‌లు చెప్ప‌డం చూస్తూనే ఉంటాం. ఇలా చెప్ప‌డం వెనుక కొన్ని ప్ర‌త్యేక కార‌ణాలు ఉన్నాయి. ప్ర‌తి రోజు మధ్యాహ్నం భోజనం తర్వాత గ్లాస్‌ మజ్జిగ తాగితే డీహైడ్రేషన్‌ దరి చేరదు. మజ్జిగ ప్రోబయోటిక్‌. అంటే ఇది మన జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బాక్టీరియాకు మేలు చేస్తుంది. దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మజ్జిగలో చిటికడు జీలకర్ర లేదా వాము పొడి కలిపి తాగితే జీర్ణసమస్యలు ఉండవు. మలబద్దకం తగ్గుతుంది. గ్యాస్, అసిడిటీలు ఉండవు. మజ్జిగ లో ఉండే అనేక ప్రోటీన్లు, మినరల్స్‌ మనశరీరానికి రోజూ అవసరమైన అనేక విధులు నిర్వర్తించేందుకు దోహదపడతాయి. కాల్షియం లోపం ఉన్నవారు రోజూ మజ్జిగ తాగడం మంచిది. దీంతో ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

                                                   

About Author