NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ధ‌నియాల వ‌ల్ల లాభాలేంటో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వంటింట్లో సర్వసాధారణంగా ఉండే వాటిల్లో దనియాలు కూడా ఒకటి. దనియాల పొడిని, దనియాలను మనం తరచూ వంటల తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. వంటల్లో దనియాల పొడిని ఉపయోగించడం వల్ల వంటల రుచి పెరగడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. దనియాలు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయని, వీటిని ఉపయోగించి మనం అనేక రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తయారు చేసే కషాయాల్లో కూడా దనియాలను ఉపయోగిస్తుంటాం. దనియాలను దంచి నీటిలో వేసి మరిగించి వడకట్టి కషాయాన్ని తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని తాగడం వల్ల కీళ్లనొప్పులు, వాపులు తగ్గుతాయి. ఇలా దనియాలు మరగించిన నీటిని రోజూ తాగుతుండడం వల్ల మూత్రం ధారాలంగా వస్తుంది.

                              

About Author