గోంగూర వల్ల లాభాలేంటో తెలుసా ?
1 min readపల్లెవెలుగువెబ్ : గోంగూర తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. గోంగూరలో పొటాషియం, ఐరన్ లాంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడి రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి, చక్కెర శాతాన్ని తగ్గించే శక్తి గోంగూరకు ఉంది. మధుమేహంతో బాధపడేవారు ఆహారంలో గోంగూరను తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చు. గోంగూరలో విటమిన్ ఎ, బి 1, బి 2, బి 9 తో పాటు సి విటమిన్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది. విటమిన్ ఎ వల్ల కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.