NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ‌గా తింటే ఎంత ప్రమాద‌మో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్ అంటే చాలు చిన్నాపెద్దా తేడా లేకుండా నోట్లో లొట్టలేసుకుంటూ తినేస్తారు. ఎక్కడ‌ప‌డితే అక్కడ బిర్యనీ, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్లు వెలుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వీటిని ఆరగించే వారి సంఖ్య కూడ రోజురోజుకూ పెరుగుతోంది. బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్ అధికంగా తింటే ఆరోగ్యానికి ప్రమాద‌క‌ర‌మ‌ని వైద్యులు చెబుతున్నారు. వీటిని ఎక్కువ‌గా తింటే ఉభ‌కాయం వ‌చ్చే ప్రమాదం ఉంద‌ని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉభ‌కాయం వ‌ల్ల మెటాబాలిజం దెబ్బతిని.. నియంత్రణ‌లేని మ‌ధుమేహం, అధిక ర‌క్తపోటు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు. బిర్యానీలు ఎక్కువ‌గా తినేవారిలో 90 శాతం మందికి ఫ్యాటీ లివ‌ర్ ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు.

About Author