NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

2జీ, 3జీ, 4జీ, 5జీ తేడా ఏమిటో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అవసరాలకు అనుగణంగా టెక్నాలజీ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ వస్తుంది. అందులో భాగమే ఈ ఐదవ జనరేషన్‌ నెట్‌ వర్క్‌. గతంలో మొబైల్‌ నెట్‌ వర్క్‌ కోసం 2జీ నెట్‌ వర్క్‌ ఉండేది. దానితో ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ చాలా సమయమే పట్టేది. ఆ తర్వాత ఇంటర్నెట్‌ వేగాన్ని పెంచుతూ 3జీ వచ్చింది. ప్రస్తుతం 4జీ నెట్‌ వర్క్‌లను వినియోగిస్తున్నాం. ఇందులో 10 ఎంబీపీఎస్‌ నుంచి 100 ఎంబీపీఎస్‌ వేగంతో డేటాను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అయితే త్వరలో రాబోతున్న 5జీ నెట్‌ వర్క్‌ 4జీ కంటే 10రెట్ల వేగంగా పనిచేస్తుంది. 5జీ అంటే ఫిప్త్‌ జనరేషన్‌ నెట్‌వర్క్‌. అంతర్జాతీయ ప్రమాణలతో 4జీ కంటే 10రెట్ల వేగంతో అందుబాటులోకి రానున్న వైర్‌ లెస్‌ నెట్‌ వర్క్‌. 5జీ నెట్‌ వర్క్‌ వేగంతో పాటు అసలు నెట్‌ వర్క్‌ సరిగ్గా లేని ప్రదేశాల్లో సైతం ఉదాహరణకు గంటల డ్యూరేషన్‌ ఉన్న సినిమా వీడియోల్ని 1, లేదా 2 నిమిషాల్లో డౌన్‌ చేసుకోవడం, తక్కువ నెట్‌ వర్క్‌లో సైతం ఆన్‌లైన్‌ క్లాసులకు అటెండ్‌ అవ్వడం, వర్క్‌ ఫ్రం హోం లాంటి పనుల్ని చక్కబెట్టుకోవచ్చు. వీటితో పాటు హై క్వాలిటీ వీడియో గేమ్స్‌ను ఆడే సౌకర్యం కలగనుంది.

                                         

About Author