జులైలో తిరుమల ఆదాయం ఎంతో తెలుసా ?
1 min readపల్లెవెలుగువెబ్ : శ‌్రీ వేకంటేశ్వరుడు కొలువైన తిరుమల ఒక్కసారైనా దర్శిస్తే అంతా మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే నిత్యం వేలాది మంది ఆ సప్తగిరీశుడ్ని దర్శించుకొని తరిస్తుంటారు. కోర్కెలు తీర్చే వెంకన్న స్వామికి భక్తులు వివిధ రూపాల్లో మొక్కుల చెల్లించుకుంటూ ఉంటారు. భక్తులు నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు స్వామివారికి సమర్పిస్తుంటారు. అంతేకాకుండా స్వామివారికి కోట్ల విలువైన భూములు కూడా సమర్పించి తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. కోవిడ్ ప్రభావం పూర్తిగా అదుపులోకి రావడంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో భక్తులను అనుమతిస్తున్నారు. దీంతో స్వామి వారి హుండీ ఆదాయం పెరుగుతూ వస్తోంది. ఇక జూలై నెలలో శ్రీవారి హుండీ రికార్డుస్థాయిలో నిండింది. మార్చిలో రూ.128 కోట్లు, ఏప్రిల్ లో రూ.127.5 కోట్లు, మే నెలలో రూ.130.5 కోట్లు, జూన్ లో రూ.123.76 కోట్ల ఆదాయం రాగా.. జూలై నెలలో రూ.139.45 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నాలుగు నెలల్లో కలిపి మొత్తం రూ.649.21 కోట్ల ఆదాయం వచ్చింది. వరుసగా ఐదు నెలలు శ్రీవారి ఆదయం రూ.100 కోట్ల మార్క్ దాటింది. జూలై నెలల్లో ఐదు సార్లు రోజువారీ హుండీ ఆదాయం రూ.100 కోట్లు దాటింది. జూలై 4వ తేదీన ఒక్క రోజే ఏకంగా రూ.6.18 కోట్ల ఆదాయం వచ్చింది.