PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డ్రైఫ్రూట్స్ ధ‌ర‌లు అధికంగా ఉండ‌టానికి కార‌ణం ఏమిటో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : డ్రైఫ్రూట్స్ ధ‌ర‌ల‌కు రెక్కలొచ్చాయి. తాలిబ‌న్లు ఆప్ఘనిస్థాన్ ఆక్రమించ‌డంతో స‌ర‌కు రవాణ నిలిచిపోయింది. దీంతో ఇప్పటికే గోడౌన్లో ఉన్న డ్రైఫ్రూట్స్ ను వ్యాపారాలు ధ‌ర‌లు పెంచి అమ్ముతున్నారు. భార‌త్-అప్ఘాన్ మ‌ధ్య వాణిజ్యానికి మార్గం సుగ‌మం అయ్యే వ‌ర‌కు డ్రైఫ్రూట్స్ ధ‌ర‌లు ఆకాశం నుంచి దిగివ‌చ్చే ప‌రిస్థితి ఉండ‌దు. అంజీర్, బాదం, పిస్తా, అప్రికాట్, వాల్ న‌ట్స్ లాంటి ప్రధాన‌మైన డ్రైఫ్రూట్స్ ను మ‌న దేశం ఆఫ్ఘనిస్థాన్ నుంచి కొనుగోలు చేస్తుంది. ఈ డ్రైఫ్రూట్స్ లో 80 శాతం దిగుమ‌తులు ఆప్ఘనిస్థాన్ పై ఆధార‌ప‌డి ఉంటాయి. ఈ నేప‌థ్యంలోనే డ్రైఫ్రూట్స్ ధ‌ర‌లు అమాంతం పెరిగిపోయాయి. ఆప్ఘన్ ను తాలిబ‌న్లు ఆక్రమించ‌డంతో డ్రైఫ్రూట్స్ పైన విస్త్రత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. అస‌లు డ్రైఫ్రూట్స్ ధ‌ర‌లు ఎందుకు ఇంత ఎక్కువ‌గా ఉంటాయి ?. వాటికి గ‌ల కార‌ణాలు ఏమిటో తెలుసుకుందాం.

– డ్రై ఫ్రూట్స్ అనే ప‌దంలోనే మ‌నకు క్లియ‌ర్ మీనింగ్ ఉంది. ఈ ప్రూట్స్ లో వాట‌ర్ కంటెంట్ చాలా త‌క్కువ‌గా ఉంటుంది. అంటే ఫ్రెష్ ఫ్రూట్ .. డ్రై ఫ్రూట్ గా మార‌డానికి కొంత స‌మ‌యం, కొంత శ్రమ అవ‌స‌రం అవుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఒక కేజీ తాజా ద్రాక్ష ధ‌ర 10 రూపాయాలు అనుకుందాం. ఒక కేజీ ఎండు ద్రాక్ష త‌యారు కావాలంటే సుమారు ఐదు కేజీల తాజా ద్రాక్ష అవ‌స‌రం అవుతుంది. అప్పుడు ఆ ఎండు ద్రాక్ష ఖ‌రీదు కేజీ. 50 రూపాయ‌లు అవుతుంది. ఆ ఎండు ద్రాక్ష త‌యారీకి ప‌ట్టిన స‌మ‌యం, శ్రమ‌, ర‌వాణ చార్జీలు, స్టోరేజీ చార్జీలు, లేబ‌ర్ చార్జీలు.. రైతు నుంచి హోల్ సేల‌ర్ కి అక్కడ నుంచి రిటైల‌ర్ కి .. రిటైల‌ర్ నుంచి క‌స్టమ‌ర్ కి ఇన్ని ద‌శ‌లు మారే స‌రికి కేజీ ఎండు ద్రాక్ష ధ‌ర 200 దాకు అవుతుంది.

డ్రై ఫ్రూట్స్ వెరైటీస్ మ‌న దేశంలో పండే పంట కాదు. ఈ పంట‌లకు మ‌న దేశ భౌగోళిక, వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు సూట‌బుల్ గా ఉండ‌వు. ఈ కార‌ణంగా మ‌నం విదేశాల నుంచి డ్రై ప్రూట్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే వేరే దేశాల నుంచి మ‌నం కొనుగోలు చేస్తాం . ప్రధానంగా ఆప్ఘనిస్థాన్ నుంచి ఎక్కువ‌గా డ్రైఫ్రూట్స్ దిగుమ‌తి చేసుకుంటాం. డ్రై ఫ్రూట్స్ విదేశాల నుంచి కొనుగోలు చేయాలంటే చాలా వ‌ర‌కు డాల‌ర్ రూపంలో డ‌బ్బు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు చాలా డ్రై ఫ్రూట్స్ మీద జీఎస్టీ 12 శాతం ఉంటుంది. ఇంపోర్ట్ చేసుకున్న డ్రై ప్రూట్స్ కి టాక్స్ లు ఎక్కువ‌గా ఉంటాయి. దీంతో పాటు స‌ర‌కు రవాణ చార్జీలు కూడ అద‌నంగా ఉంటాయి. ఇవ‌న్నీ క‌ల‌ గలిపితే.. డ్రై ఫ్రూట్స్ ధ‌ర‌లు నిర్ణయంచ‌బ‌డ‌తాయి.
– సాధారణంగా ఒక బ‌య్యర్ విదేశాల నుంచి ఒక ట‌న్ను డ్రై ఫ్రూట్స్ దిగుమ‌తి చేసుకుంటే.. ఆ బ‌య్యర్ స‌ర‌కు కొన‌డానికి చేసిన ఖ‌ర్చు, దిగుమ‌తి చేసుకోవ‌డానికి అయిన ర‌వాణ ఖ‌ర్చు, టాక్స్ లు, ఆ బ‌య్యర్ ఫ్రాఫిట్ మార్జిన్ ఇవ‌న్నీ క‌లిపి.. ఒక కేజీ డ్రై ఫ్రూట్స్ ధ‌ర నిర్ణయించ‌బ‌డుతుంది. ఇంపోర్ట్ చేసుక‌న్న బ‌య్యర్ నిర్ణయించిన ధ‌ర‌కు హోల్ సేల్ కొనుగోలు చేస్తారు. ఆ హోల్ సేల‌ర్ త‌న ప్రాఫిట్ మార్జిన్.. ర‌వాణ ఖ‌ర్చులు, ఇర‌త ఖ‌ర్చుల‌ తో క‌లిపి రిటైల‌ర్ కి అమ్ముతాడు. ఆ రిటైల‌ర్ త‌న మొత్తం ఖ‌ర్చులు ప్లస్ ప్రాఫిట్ మార్జిన్ తో క‌స్టమ‌ర్ కి అమ్ముతాడు. ఇన్ని ద‌శ‌లు దాటుకుని వినియోగ‌దారుడికి చేరుకునే స‌మ‌యానికి డ్రై ఫ్రూట్స్ ధర‌లు ఆకాశాన్ని అంటుతాయి.

About Author