చంద్రబాబుకు, విజయసాయిరెడ్డికి ఉన్న బంధుత్వం తెలుసా ?
1 min read
పల్లెవెలుగువెబ్ : తనకు చంద్రబాబు వరసకు అన్న అవుతాడని, తనకు అన్న, బంధువు అయినంత మాత్రాన ఆయన ఆస్తులన్నీ తనవైపోతాయా అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన బంధువుల కంపెనీలన్నీ తనవే అయితే.. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ కంపెనీ కూడా తనదేనన్నారు. బంధువులైనంత మాత్రాన అరబిందో.. హెరిటేజ్ ఒక్కటైపోతాయా అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లోకేశ్, తెలుగుదేశం పార్టీ తనను సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తే.. తాను కూడా అందుకు పదిరెట్లు స్పందిస్తానని హెచ్చరించారు.