సీబీఐ కోర్టులో జగన్ ఏం చెప్పారో.. తెలుసా ?
1 min readపల్లెవెలుగు వెబ్: సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ మీద సీబీఐ కోర్టులో విచారణ ప్రారంభమైంది. 98 పేజీలతో జగన్ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. జగన్ బెయిల్ షరతులను ఎక్కడా ఉల్లంఘించలేదని, సీబీఐని ప్రభావితం చేశారన్న వాదనలో నిజం లేదని జగన్ తరపు న్యాయవాదులు కోర్టకు విన్నవించారు. సీబీఐ కేంద్ర హోం శాఖ పరిధిలో పని చేస్తుందని, రఘురామకృష్ణ రాజుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇలాంటి కేసుల్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోవద్దని సుప్రీం కోర్టు తీర్పులు ఉన్నాయని జగన్ తరపు న్యాయవాదులు గుర్తు చేశారు.