PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చాక్లెట్స్ ఎప్పుడు తింటే మంచిదో తెలుసా ?

1 min read

Melted pieces of dark chocolate bar in splash texture

ప‌ల్లెవెలుగు వెబ్: చాక్లెట్స్ అంటే ఇష్టప‌డ‌ని వారు ఉండ‌రు. చిన్నా పెద్ద వ‌య‌సుతో తేడా లేకుండా చాక్లెట్స్ తింటారు. పురుషుల కంటే మ‌హిళ‌లు చాక్లెట్స్ తిన‌డానికి ఇష్టప‌డ‌తారు. కానీ లావైపోతామని భ‌య‌ప‌డుతుంటారు. ఉద‌యం పూట మిల్క్ చాక్లెట్స్ తింటే బ‌రువు పెర‌గ‌ర‌ని, ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిల‌ను తగ్గిస్తూ.. కొవ్వును క‌రిగిస్తుంద‌ని ఓ అధ్యయ‌నంలో తేలింది. మ‌హిళ‌ల‌లు ఏయే స‌మ‌యంలో చాక్లెట్స్ తింటే ఎలాంటి ప్రభావం ఉంటుంద‌న్న విష‌యం పై స్పెయిన్ లోని యూనివ‌ర్శిటీ ఆఫ్ ముర్సియా తో క‌లిసి బ్రిగ్ హం రీస‌ర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు అధ్యయ‌నం చేశారు. ఇందుకోసం కొంత మంది మ‌హిళ‌ల‌ను ఎంచుకున్నారు. ఈ ప‌రిశోధ‌న‌లో ఉద‌యం లేదా రాత్రిపూట చాక్లెట్స్ తింటే బ‌రువు పెర‌గ‌ర‌ని తేలింది. ఉద‌యం పూట ఎక్కువ చాక్లెట్స్ తిన్నా బ‌రువు పెర‌గ‌ర‌ని, శ‌రీరంలో షుగ‌ర్ స్థాయి అదుపులో ఉంటూ.. కొవ్వును త‌గ్గిస్తుంద‌ని తేలిందట‌. అలా కాకుండా ప‌గ‌టి పూట‌, సాయంత్ర వేళ చాక్లెట్స్ తింటే ఆక‌లి, నిద్ర పై ప్రభావం చూపుతుంద‌ట‌.

About Author