మన దేశానికి బంగారం ఎక్కడ నుంచి వస్తుందో తెలుసా ?
1 min readపల్లెవెలుగు వెబ్: ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం దిగుమతిదారుగా భారతదేశం ఆవిర్భవించింది. గతంలో ఈ స్థానంలో సౌదీ అరేబియా ఉండేది. చైనా దేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం దిగుమతిదారు. చైనా తర్వాతి స్థానం భారత్ దే. భారత్ కు ఒకే దేశం నుంచి పెద్ద మొత్తంలో బంగారం దిగుమతి అవుతోంది. ఆ దేశమే స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం శుద్ధికేంద్రం. ఇక్కడ అత్యున్నత శ్రేణి బంగారం లభిస్తోంది. స్విట్జర్లాండ్ పెద్ద రవాణ హబ్ గా కూడ ఉంది. దీంతో బంగారం ప్రియులు స్విట్జర్లాండ్ బంగారానికే మొగ్గుచూపుతున్నారు. స్విట్జర్లాండ్ బంగారం పై పన్ను 12.5 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది.