PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ‘ప‌వ‌ర్ స్టార్’ బిరుదు ఎవ‌రిచ్చారో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. త‌న సైల్, మేన‌రిజం, లుక్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు. యువ‌త‌లో అత్యధిక క్రేజ్ ఉన్న హీరో. ప‌న‌వ్ క‌ళ్యాణ్ సినిమా అంటే ప్రేక్షకుల‌కు పండ‌గే. ఫ్యాన్స్ సంగ‌తి ఇక చెప్పక్కర్లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరుకు ముందు ‘ ప‌వ‌ర్ స్టార్’ అనే ట్యాగ్ ఎప్పుడూ సినిమా టైటిల్స్ లో ప‌డుతుంది. అయితే.. ఈ ట్యాగ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి ఎవ‌రిచ్చారో చాలా మందికి తెలియ‌దు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన గోకులంలో సీత‌ సినిమాకి స్ట్రిప్ట్ రాసింది పోసాని కృష్ణముర‌ళి. ఆ సినిమా ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో.. పోసాని మాట్లాడుతూ ఈ సినిమాతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌వ‌ర్ స్టార్ అవుతాడ‌ని చెప్పారు. ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్షన్లు రాబ‌ట్టడంతో .. త‌ర్వాతి సినిమా ‘సుస్వాగతం’ నుంచి ప‌వ‌ర్ స్టార్ అనే ట్యాగ్ ని ప్రతి సినిమా టైటిల్స్ లో పొందుప‌రిచారు. అప్పటి నుంచి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే పేరు అభిమానుల‌కు తార‌క మంత్రంగా మారింది.

About Author