ఆర్బీఐ రెపో రేట్ పెంపుతో ఎవరికి నష్టమో తెలుసా ?
1 min readపల్లెవెలుగువెబ్ : రిజర్వ్ బ్యాంక్ రెపోరేటును పెంచింది. దీని వల్ల కొంత మందికి భారం పడే అవకాశం ఉంది. రెపో రేట్ పెంచడంతో హోంలోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోను వడ్డీరేట్లె పెరగనున్నాయి. ఇప్పటికే పాత వడ్డీరేటుతో తీసుకున్న వారిపై కూడా ఈ పెంపు భారం పడనుంది. ఆర్బీఐ వడ్డీరేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రేపోరేటు 4 శాతం నుంచి 4.40 శాతానికి పెరిగింది. దీని ప్రకారం పాత వడ్డీ రేటు 0.40 శాతం పెరుగుతుంది. కొత్తగా రుణం తీసుకునే వారు అధికంగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇక ఇప్పటికే రుణం తీసుకుని ఈఎంఐలు చెల్లిస్తున్న వారిపై నేరుగా వడ్డీ భారం పెరగకపోయినా.. పెరిగిన వడ్డీ రేటు సర్థుబాటులో భాగంగా అదనపు ఈఎంఐలు చెల్లించాల్సి వస్తుంది.