NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్టీఆర్ ఇష్ట‌మైన డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్ర‌ముఖ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న అభిమాన డైరెక్ట‌ర్ ఎవ‌రో చెప్పేశాడు. ఇటీవల ఓ బాలీవుడ్ మీడియా పెర్సన్ .. తారక్ కు మీ ఫేవరేట్ బాలీవుడ్ డైరెక్టర్ ఎవరని అడగగా.. క్షణం కూడా ఆలోచించకుండా ఠక్కున రాజ్ కుమార్ హిరాణీ పేరు చెప్పాడు. మనుషుల్లో ఉండే సహజమైన భావోద్వేగాల్ని హిరాణీ ఎంతో సరదాగా తెరపై ప్రెజెంట్ చేసే తీరు తనకెంతో నచ్చుతుందని తారక్ తెలిపాడు. భారీ చిత్రాలు తీయడంలో చేయితిరిగిన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అన్నా కూడా తనకెంతో ఇష్టమని చెప్పాడు తారక్. ఇదివరకు యన్టీఆర్ తో భన్సాలీ ఓ బాలీవుడ్ సినిమా తీయబోతాడనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు రాజ్ కుమార్ హిరాణీ పేరు కూడా తారక్ నోటి నుంచి వచ్చింది కాబట్టి.. త్వరలోనే ఆయన దర్శకత్వంలో యన్టీఆర్ హీరోగా ఒక సినిమా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

                        

About Author