NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

`బింబిసార‌`లోని బేబి శ్రీదేవి ఎవ‌రి కూతురో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ‘బింబిసార’లో చిన్నారి పాత్రలో నటించి అందరి మన్ననలు పొందింది బేబి శ్రీదేవి. త్రిగర్తల సామ్రాజ్యంలో ఆయుర్వేద పండితుడి (తనికెళ్ల భరణి) మనవరాలు శాంభవిగా, భూలోకంలో బింబిసారుడి వంశంలో పుట్టిన మొదటి ఆడపిల్లగా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. బేబి శ్రీదేవి అమాయకత్వం, కల్యాణ్‌ రామ్‌తో వచ్చే సీన్లు మనసుకు హత్తుకుంటాయి. అయితే ప్రస్తుతం ఈ పాప ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ పాప ఎవరు అని సెర్చ్‌ చేస్తున్నారు. బేబి శ్రీదేవి తల్లిదండ్రులు శ్రీహరి గౌడ్, శ్రీలక్ష్మి. వీరు హైదరాబాద్‌లో నివాసముండగా, శ్రీహరి గౌడ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న బేబి శ్రీదేవి పున్నాగ, పౌర్ణమి, చెల్లెలి కాపురం, కల్యాణ వైభోగం వంటి 15 సీరియల్లలో నటించి ఆకట్టుకుంది. అలాగే మేజర్‌, రామా రావు ఆన్‌ డ్యూటీ వంటి చిత్రాల్లో సైతం నటించింది.

                                         

About Author