NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాహుల్ గాంధీ నేపాల్ ఎందుకు వెళ్లారో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేపాల్ రాజ‌ధాని ఖాట్మాండు ప‌ర్య‌ట‌న‌పై వివాదం చెల‌రేగింది. నేపాల్ కు రాహుల్ ఎందుకు వెళ్లారు ?.. ఎవ‌రి పెళ్లికి వెళ్లార‌న్న ప్ర‌శ్న అంద‌రిలోను మొదలైంది. ఖాట్మాండులో ఓ జ‌ర్న‌లిస్టు పెళ్లికి రాహుల్ వెళ్లారు. ఆమె పేరు సుమ్నియా ఉదాస్. జర్నలిస్ట్‌గా పనిచేసిన ఆమె రాహుల్‌కు స్నేహితురాలు. న్యూఢిల్లీలో ఆమె సీఎన్‌ఎన్ కరస్పాండెంట్‌గా ఆమె గతంలో పనిచేశారు. రాజకీయం, ఆర్థిక వ్యవహారాలు, సామాజిక సమస్యలను ఆమె తన వృత్తి ధర్మంలో భాగంగా కవర్ చేశారు. 2001 నుంచి 2017 వరకూ ఆమె సీఎన్‌ఎన్ కోసం జర్నలిస్ట్‌గా పనిచేశారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఎన్నో ప్రముఖ అంశాలపై ఆమె రిపోర్టింగ్ చేశారు. నేపాల్ అంబాసిడర్ భీమ్ ఉదాస్ కూతురే సుమ్నియా ఉదాస్. ఈమె వివాహానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఆహ్వానం అందింది. సుమ్నిమా దాస్ నేపాల్‌కు చెందిన పారిశ్రామికవేత్త నిమ మర్లిన్ షెర్పాన్‌ను పెళ్లాడారు. మే 5న వీరి వివాహ రిసెప్షన్ కార్యక్రమం జరగనుంది. ఈ రిసెప్షన్‌కు కూడా హాజరు కావడం కోసం రాహుల్ గాంధీ ఖాట్మండులోని మారియ‌ట్ లో బస చేస్తున్నారు. దీని పై బీజేపీ విమ‌ర్శ‌లు చేసింది.

                                   

About Author