NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

న్యాయ‌వాదుల‌కు ఫీజు ఇవ్వ‌రా … 12 శాతం వ‌డ్డీతో ఇవ్వండి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రభుత్వానికి న్యాయసేవలు అందిస్తున్న అడ్వకేట్లకు సకాలంలో ఫీజులు చెల్లించపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలకు సేవలు అందిస్తున్న లా ఆఫీసర్లయిన ప్రభుత్వ న్యాయవాదులు (జీపీలు), ఏజీపీలు, స్టాండింగ్‌ కౌన్సిళ్ల ఫీజులను సకాలంలో చెల్లించకపోవడం చట్టబద్ధమైన హక్కులను హరించడమేనని పేర్కొంది. హుందాగా జీవించే హక్కును కాలరాయడమే.. 21వ అధికరణను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. పెండింగ్‌ బిల్లులను నాలుగు వారాల్లో చెల్లించాలని తేల్చి చెప్పింది. చెల్లింపులో విఫలమైతే 12శాతం వడ్డీ కలిపి ఇవ్వాలని స్పష్టం చేసింది.

                                      

About Author