మీ వాట్సాప్ బ్లాక్ చేశారని అనుమానం ఉందా ?.. ఇలా తెలుసుకోండి
1 min readపల్లెవెలుగు వెబ్ : మనం తరుచూ వాట్సాప్ లో చాట్ చేస్తుంటాం. కొందరు మనమంటే నచ్చకో.. దురుద్దేశంతోనో వాట్సాప్ బ్లాక్ చేస్తుంటారు. అవతలి వ్యక్తి మన వాట్సాప్ బ్లాక్ చేశారనే విషయం మనకు తెలియదు. వాట్సాప్ యూజర్ గోప్యతా ప్రమాణాల ప్రకారం ఎవరైన మన నంబర్ బ్లాక్ చేస్తే.. వాట్సాప్ ఆ విషయం మనకు చెప్పకూడదు. మరి మన నంబర్ బ్లాక్ చేశారో.. లేదో తెలుసుకోవడం ఎలా ?.
- వాట్సాప్ లో మిమ్మల్ని ఎవరైన బ్లాక్ చేశారనే అనుమానం కలిగితే .. వాళ్ల చాట్ విండోస్ ఓపెన్ చేసి.. చివరగా ఎప్పుడు చూశారో చెక్ చేయండి. ఆన్ లైన్ స్టేటస్ చూడండి. అవతలి వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేస్తే లాస్ట్ సీన్, స్టేటస్ లను మీరు చూడలేరు. అలాగే సదరు వ్యక్తి సెట్టింగ్స్ లో లాస్ట్ సీన్ డిజేబుల్ చేసినా.. చివరగా ఎప్పుడు చూశారన్న విషయం తెలియదు.
- వాట్సాప్ లో ఎవరైన బ్లాక్ చేస్తే వారి ప్రొఫైల్ ఫోటో మీరు చూడలేరు. అవతలి వ్యక్తి ప్రొఫైలో ఫోటో పెట్టకపోయినా మీకు ఫోటో కనిపించదు. ఇలాంటి సందర్భంలో మనల్ని బ్లాక్ చేశారని అనుకోకూడదు.
- వాట్సాప్ కాల్ చేసినప్పుడు కలవకపోయినా.. ఫోన్ కాల్ వెళ్లకపోయినా.. మెసేజ్ డెలివరీ నోటిఫికేషన్ రాకపోయినా సదరు వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేసినట్టు లెక్క.
- మీ నంబర్ బ్లాక్ చేశారనుకున్న వ్యక్తి నెంబర్ తో ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. అప్పుడు గ్రూప్ క్రియేట్ చేయడానికి ఆ వ్యక్తి అనుమతి లేదని మెసేజ్ కనిపిస్తే .. మిమ్మల్ని బ్లాక్ చేశారని అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రిక్ ద్వార సులువుగా తెలుసుకోవచ్చు.