PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జ‌గ‌న్ నిర్ణ‌యంతో మంచి జ‌రుగుతుంద‌ని భావిస్తున్నా .. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మార్గదర్శి కేసులో రామోజీరావు తానేమీ తప్పు చేయలేదని చెప్పుకొస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తెలిపారు. సోమవారం మార్గదర్శిపై సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఉండవల్లి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్‌ అవడం శుభపరిణామమని చెప్పుకొచ్చారు. సీఎం జగన్‌ నిర్ణయంతో న్యాయం జరుగుతుందని భావిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అఫిడవిట్‌ దాఖలు చేయాలని కోరారు. ఈ కేసులో తప్పక ఫలితం తేలుతుంది. మార్గదర్శి అవినీతి బట్టబయలవుతుంది. కోర్టు ముందు అందరూ సమానమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు.

                                    

About Author