కేసీఆర్ ప్రధాని కావాలని అనుకుంటున్నారేమో !
1 min readపల్లెవెలుగువెబ్: ఇప్పటికే తెలంగాణ సీఎంగా కేసీఆర్ రెండు సార్లు ఎన్నికయ్యారని.. అందుకే ఇప్పుడు ప్రధాని అవ్వాలి అనుకుంటున్నారేమో అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. అలాగే కేసీఆర్ కు ఆంధ్రలో ఆధరణ ఉంటుందో లేదో కాలమే నిర్ణయమిస్తుంది అన్నారు. ఉద్యమం సమయంలో కేసీఆర్ పై ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని.. మనని వెనక్కు పంపారనే భావన ఉందన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత హైరాబాద్ లో ఉన్న సెటిలర్స్ కేసీఆర్ కు అనుకూలంగా మారారు. మరి ఆ వ్యతిరేకత ఎంత వరకు ఉంటుంది..? ఆయనకు అభ్యర్థులు దొరకుతారో లేదో అప్పుడే చెప్పలేం అన్నారు. చంద్రబాబు వెళ్లి తెలంగాణలో పోటీ చేయడం లేదా అని ప్రశ్నించారు.