PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విఐపి కార్డు లాగా డోన్ నియోజకవర్గాన్ని గొప్పగా చేప్పాలి:మంత్రి

1 min read

– డోన్ నియోజకవర్గం లో 2,400 కోట్లతో అభివృద్ధిపనులు
– ప్రతి పల్లె గ్రామానికి డబల్ రోడ్లు
– డోన్ నియోజకవర్గం లో ఇంటింటికి కులాయి ఇస్తున్నాము,అలాగే 68చెరువుల కునీరు నింపుతం
– ప్రజ సంక్షేమమే వైసీపీ ప్రభుత్వం ద్యేయం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: విఐపి కార్డు లాగా డోన్ నియోజకవర్గాన్ని గొప్పగా చేప్పాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఈసందర్భంగా బుధవారంప్యాపిలి ప్రాధమిక సహకార పరవతి సంఘము బోరెడ్డి రామచంద్రా రెడ్డి అభినందన సభకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హాజరుకగా అయనకు మాజీ జెడ్పీటీసీ దిలీప్ చక్రవర్తి అధ్యక్షతఘన స్వాగతం పలికారు. మంత్రి బుగ్గన మాట్లాడుతూ బోరెడ్డి రామచంద్రా రెడ్డి మంచి మనిషి, లౌకికుడు, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి రైతు కుటుంబంలో నుండి వచ్చిన వ్యక్తి అలాగే ఆయన చిన్నాయన బోరెడ్డి పుల్లరెడ్డి అందరిలోవుంటు,రైతులకు సహాయం చేస్తు పరిచస్తుడుగా వ్యక్తి అని తమసోదరుడు స్వర్గీయ బోరెడ్డి విశ్వనాథ్ రెడ్డి కుమారుడు బోరెడ్డి రామచంద్రా రెడ్డి కి సింగల్ విండో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టామని ఆయన తెలిపారు.ప్యాపిలి పట్టణంలో నడిఒడులోవున్న అతిపురమైన శ్రీ చేన్నకేశవ స్వామి దేవాలయం స్థితిల వ్యవస్థలో వుండిపోయింది, దేవాలయం నిర్మాణం పైన చోరవచూపాలని బోరెడ్డి జెయచంద్రరెడ్డి మంత్రి బుగ్గనకు సభపూర్వకంగా తెలియజేశారు. అనంతరం మంత్రి బుగ్గన మాట్లాడుతూ ప్యాపిలి లో ఇసుక దందా రియల్ ఎస్టేట్ వ్యాపారము వైసిపి వారు చేస్తున్నారు అని అంటున్నాడు అసలు ఇసుకనే లేకపోతే ఇసుక ఎలా చేస్తారు.డోన్ లో అభివృద్ధి ఏమి జరగలేదు అంటున్నావు నువ్వు నడిచిన యువగళం పాదయాత్ర రోడ్డు మేమేసిందే కాదా ,డోన్ నియోజకవర్గం లో ప్రతి పల్లె గ్రామానికి డబల్ రోడ్డు వేసింది అభివృద్ధి కాదా,డోన్ నియోజకవర్గం లో ఇంటింటికి కులాయి ఇస్తున్నాము మీ నాన్న రెండు సార్లు ముఖ్యమంత్రి అయితే కుప్పంలో ఇంటింటికి నీళ్లు ఇచ్చారా ,గుండాల చెన్నకేశవ స్వామి దేవాలయం ని అభివృద్ధి చేస్తుంటే గుప్త నిధుల కోసం తవ్వుతున్నారు అని హేళనా చేస్తున్నారు,డోన్ నియోజకవర్గం లో 2,400 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నది వాస్తవం కాదా…. చెప్పుకోవాలి , డోన్ ఇన్చార్జి అయిన ధర్మవరం సుబ్బారెడ్డికి టిడిపి ఆయంలోనే అక్రమ మైనింగ్ చేశాడని టిడిపి ప్రభుత్వం 100 కోట్లు జరిమానా విధించిందని తెలిపారు.డోన్ ఇంచార్జి ధర్మారం సుబ్బారెడ్డి నాటు సారా పై మూడు నెలలు జైలుకు వెళ్ళింది నిజం కాదా ,వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే ఓరువలేక వాస్తవైన మాటలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈకార్యక్రమంలో జెడ్పీటీసీ బోరెడ్డి శ్రీరామిరెడ్డి ,రాష్ట్ర మిట్ చైర్మన్ శ్రీరాములు ,సర్పంచ్ లక్ష్మీ దేవి ,వైప్రసిడెంట్ గడ్డం భూనేశ్వర్ రెడ్డి ,వ్యవసాయ సలహా మండల చైర్మన్ మొట్టు వెంకటేశ్వరరెడ్డి ,బోర మల్లికార్జున రెడ్డి ,కమతం భస్కార్ రెడ్డి ,డోన్ మార్కెట్ యార్డు చైర్మన్ రాజ నారాయణ మూర్తి ,న్యాయవాదులు నాగభూషణం రెడ్డి ,మాజీ సింగల్ విండో వెంకట రెడ్డి తదితరులు వైసీపీ నాయకులు ,కర్యకర్తలు పాల్గొన్నారు.

About Author